కొన్ని గంటల్లో ఐపీఎల్ షురూ.. ఈ చానళ్లలో..  - MicTv.in - Telugu News
mictv telugu

కొన్ని గంటల్లో ఐపీఎల్ షురూ.. ఈ చానళ్లలో.. 

September 19, 2020

Is IPL 2020 Live Telecast Available on DD Free Dish, DD National, DD Sports, Doordarshan and Star Sports First TV Channels?

కరోనా కారణంగా వినోదానికి దూరమైన క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ 13వ సీజన్ ఊరట కలిగించనుంది. కరోనా ఆంక్షల నడుమ ఉంటుందా లేదా అన్న అనుమానాలను బద్దలు కొడుతూ నేడు  సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానుంది. వైరస్ కారణంగా ఈసారి ఐపీఎల్ ఆతిథ్యాన్ని యూఏఈ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఆరంభ మ్యాచ్‌లో ఈ సాయంత్రం డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌‌, చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనున్నాయి. అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో తొలిమ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ ఆరంభ పోరుకు ఆతిథ్యమిస్తున్న షేక్ జయేద్ స్టేడియం పిచ్‌పై గతంలో భారీ స్కోర్లు నమోదైన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మందకొడిగా ఉండే పిచ్‌పై పవర్ హిట్టింగ్ చేద్దామంటే కుదరదు. సహనంతో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు రాణించే అవకాశాలు ఉన్నాయి. 

పైగా పెద్ద మైదానం కావడంతో సిక్సర్లు కొట్టాలంటే బ్యాట్స్‌‌మెన్‌ అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. ప్రారంభ పోరులో తలపడుతున్న ఈ రెండు జట్లు ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 28 సార్లు నువ్వానేనా అనుకున్నాయి. ముంబయి జట్టు 17 సార్లు విజయం అందుకోగా,  సూపర్ కింగ్స్ 11 సార్లు గెలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్ 4 సార్లు టైటిల్ నెగ్గగా, ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు విజేతగా నిలిచింది. ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ టోర్నీ లైవ్ టెలికాస్ట్ వివరాలు ఏంటో చూద్దాం. 


ఇంగ్లీష్ టెలికాస్ట్ ఇలా..
స్టార్ స్పోర్ట్స్ 1
స్టార్ స్పోర్ట్స్ 2
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 1
స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ 2

హిందీ టెలికాస్ట్..
స్టార్ స్పోర్ట్స్ 1 హిందీ
డీడీ నేషనల్

తెలుగులో..

మా మూవీస్

ఆన్‌లైన్ బ్రాడ్ కాస్టింగ్ (ఓటీటీ ప్లాట్ ఫామ్):
హాట్ స్టార్
జియో టీవీ
రెడ్ బాక్స్ టీవీ