చలికాలంలో బైక్ నడపడం అనేది ఒక పెద్ద సమస్య ఏం చెప్పాలి ఎందుకంటే, మంచు కారణంగా రోడ్డు సరిగా కనిపించదు, తద్వారా యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఈ మంచులో హెల్మెట్ పెట్టుకుని ధరించాలంటే మరింత కష్టమనే చెప్పాలి.
చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల రాత్రి, తెల్లవారుజామున పొగమంచును ఎదుర్కొంటున్నారు. చలిలో హెల్మెట్ పెట్టుకుని బైక్ నడపటంలో చాలా పెద్ద సమస్య. ఎందుకంటే బైక్ నడుపుతున్నప్పుడు , హెల్మెట్ ధరించినప్పుడు లోపల ఆవిరి కారణంగా రోడ్డు కనిపించడంలో సమస్య ఉంటుంది. పొగమంచులో, రహదారిపై దృశ్యం సరిగ్గా కనిపించదు. అదే సమయంలో, హెల్మెట్ పెట్టుకుంటే రోడ్డు వ్యూ మరింత బలహీనంగా మారుతుంది. అలాంటి పరిస్థితులలో ఏయే అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి, ఎలా డ్రైవింగ్ చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం.
బైక్ నడుపుతున్నప్పుడు చేతి తొడుగులు ధరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే చలిలో బైక్ నడుపుతున్నప్పుడు చేతి వేళ్లు కొయ్యబారిపోయి ఎమర్జెన్సీ సమయంలో బ్రేక్‌లు వేయడం ఇబ్బంది ఏర్పడుతుంది. చేతి తొడుగులు ధరించకపోవడం వల్ల, రైడర్ దృష్టి చాలాసార్లు చెడిపోతుంది. ఎందుకంటే, చలి కారణంగా, రైడర్ దృష్టి సరిగ్గా కేంద్రీకరించబడదు. అందువల్ల, బైక్ నడుపుతున్నప్పుడు హ్యాండ్ గ్లోవ్స్ ఉపయోగించండి.
హెల్మెట్ ధరించి చలిలో బైక్ నడిపే ముందు హెల్మెట్‌ను సరిగ్గా శుభ్రం చేయాలి. ప్రతి రైడ్‌ను ప్రారంభించే ముందు హెల్మెట్ అద్దాన్ని శుభ్రమైన గుడ్డతో శుభ్రం చేయాలి, తద్వారా మీరు రోడ్డు వ్యూ ను చూడటంలో ఇబ్బంది ఉండదు. అలాగే సురక్షితంగా ప్రయాణించవచ్చు.
హెల్మెట్ లోపల ఆవిరి వస్తే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హెల్మెట్ లోపల నుండి ఆవిరిని విడుదల చేయడానికి, మీరు స్లో మోషన్లో నడుస్తున్నప్పుడు హెల్మెట్‌ను లైట్ గా తెరవాలి, తద్వారా గాలి వెళుతుంది మరియు లోపల ఆవిరి బయటకు వస్తుంది, ఆ తర్వాత మీరు హెల్మెట్‌ను పూర్తిగా మూసివేయవచ్చు.
లేదంటే హెల్మెట్ ముందున్న అద్దాన్ని పైకెత్తి మాస్కు ధరించి బండిని నడపవచ్చు అప్పుడు పొగమంచు సమస్య ఉండదు. ఒక మంచి ఎక్కువగా ఉన్నప్పుడు బండి వేగం చాలా తక్కువగా ఉండాలి. అప్పుడు జరగరాని ప్రమాదం ఏదైనా జరిగినా బండి మీ కంట్రోల్ లో ఉంటుంది.