జడ్జిపై చెప్పు విసిరిన అనుమానిత ఉగ్రవాది - MicTv.in - Telugu News
mictv telugu

జడ్జిపై చెప్పు విసిరిన అనుమానిత ఉగ్రవాది

February 5, 2020

ffffffgh

న్యాయస్థానంలో ఓ ఉగ్రవాది వీరంగం సృష్టించాడు. విచారణ జరుగుతున్న సమయంలో జడ్జిపై తన షూ విసిరాడు.  కోల్‌కతాలోని బాంక్‌షాల్ కోర్టులో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. న్యాయమూర్తి ప్రశాంజిత్‌పై దాడికి పాల్పడటంతో అతన్ని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

అబు మూసా అనే వ్యక్తికి ఐసీసీ,జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ వంటి ఉగ్రవాద సంస్థలతో సంబందాలు ఉన్నాయని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో విచారణ జరుపుతున్న సమయంలో అతడు తన కాలికి ఉన్న షూ విసిరాడు. మీ న్యాయస్థానాలపై నాకు నమ్మకం లేదంటూ గట్టిగా అరిచాడు. ఆ షూ జడ్జి ముందు ఉన్న ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది తమాల్ ముఖర్జీకి తగిలింది. దీంతో కొంతసేపు అక్కడ గందరగోళం నెలకొంది.