వ్యాపారాల్లో నష్టపోయిన వారు ఆత్మహత్యలకు పాల్పడటం మనం తరచుగా వింటుంటాం. అలానే సినిమా నిర్మాణంలో దెబ్బతిని దివాళా తీసిన వారు ఉంటారు. అయితే తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి బాలీవుడ్ లో చోటుచేసుకుందని సెన్సేషనల్ క్రిటిక్ కమల్ ఆర్ ఖాన్ రివీల్ చేశాడు. బాలీవుడ్ సెలబ్రిటీలను విమర్శించడం నుండి వివాదాస్పదంగా మాట్లాడటం వరకు.. KRK అటెన్షన్ గ్రాబ్ చేయటంలో ఎప్పుడూ విఫలం కాలేదు. ఆర్ఆర్ఆర్ బ్యూటీ అలియా భట్ తన భర్త రణ్‌బీర్ కపూర్ తో కలిసి చేసిన భారీ బడ్జెట్ చిత్రం బ్రహ్మాస్త్ర. సౌత్ లో తన భుజస్కందాలపై మోస్తూ రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేశాడు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమలలో రాజమౌళి బ్రాండ్ తో విడుదలైన బ్రహ్మాస్త్ర కి నిర్మాత కరణ్ జోహార్. సుమారుగా 500కోట్ల పెట్టుబడితో దీన్ని రూపొందించారు కరణ్ జోహార్.
అయితే బాహుబలి స్ఫూర్తిగా విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ బాక్సాఫీస్ దెగ్గర బోల్తా కొట్టింది. దాంతో తీవ్రంగా నష్టపోయాడు కారం జోహార్. అన్ని భాషలలో కలిపి కారం జోహార్ కి సుమారుగా 400కోట్ల నష్టం వచ్చినట్టు బాలీవుడ్ టాక్. అయితే కరణ్ జోహార్ ఏం చేసినా విమర్శించే వ్యతిరేక బ్యాచ్ ఒకటి బాలీవుడ్ లో ఉంటుంది. అందులో ప్రముఖుడు ఈ కమల్ ఆర్ ఖాన్. కరణ్ జోహార్ పై వ్యక్తిగత విమర్శల దాడికి దిగాడు. బ్రహ్మాస్త్ర డిజాస్టర్ ని తట్టుకోలేక కరణ్ జోహార్ సూసైడ్ అటెంప్ట్ చేశాడని సంచలన కామెంట్స్ చేశాడు. కేఆర్కే తన తాజా ట్వీట్లో ‘బ్రహ్మాస్త్ర’ భారీ నష్టాలను చవిచూసిందని పేర్కొన్నాడు. దీంతో చిత్ర నిర్మాత కరణ్ జోహార్ ఆత్మహత్యకు ప్రయత్నించాడని.. తర్వాత ముఖేష్ అంబానీ అతనికి రూ. 300 కోట్లు అప్పుగా ఇవ్వడంతో కారం జోహార్ ఊపిరి పీల్చుకున్నాడని ట్వీట్ చేశాడు. అంతేకాదు ఇకనైనా తాను దివాళా తీసినట్లుగా ప్రకటించాలని ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌కు ఈ సందర్భంగా సూచించాడు.