Is Samantha Heavy Gym Workouts Are Reasons For Myositis Disease
mictv telugu

సమంత వ్యాధికి ఆ ఒక్క తప్పే కారణమా.. అది అతిగా చేయటమే కొంపముంచిందా ?

October 31, 2022

Is Samantha Heavy Gym Workouts Are Reasons For Myositis Disease

సోషల్ మీడియాలో ఒక్కసారిగా సమంతపై సానుభూతి పెరిగిపోయింది. మొన్నటివరకు తిట్టిన నోర్లె నేడు అయ్యో పాపం అంటున్నాయి. నాగచైతన్యతో విడాకులకు సమంతనే కారణమని తెగ ట్రోల్ చేసిన నెటిజన్స్.. నేడు ‘గెట్ వెల్ సామ్..’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక యావత్ టాలీవుడ్ అంత సమంతని ఓదారుస్తూ పోస్టులు పెడుతుంది. తనకు కొన్ని నెలల క్రితం మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధి నిర్ధరణ అయినట్లు సమంత చెప్పగానే జనాలంతా షాక్ అయిపోయారు. ఎప్పుడూ నవ్వుతు నవ్విస్తూ నటిస్తూ ఉండే సామ్ కి ఇంత సీరియస్ రోగమేంటి అని బాధపడ్డారు. అయితే సోషల్ మీడియాలో మరో చర్చ నడుస్తుంది. కోటి మందిలో ఒకరికి వచ్చే మయోసైటిస్ అనే వ్యాధి అసలు సమంతకు ఎందుకు వచ్చింది? వ్యాధి సోకడానికి కారణాలు ఏంటీ ? అంటూ సమంత అనారోగ్యంపై రకరకాల కథనాలు వస్తున్నాయి.

Is Samantha Heavy Gym Workouts Are Reasons For Myositis Disease

సమంత సన్నిహితులు, వైద్య నిపుణులు ఈ వ్యాధి రావడానికి ఒక కారణాన్ని బలంగా చెప్తున్నారు. చైతుతో విడాకుల తరువాత డిప్రెషన్ కి వెళ్ళింది సమంత. ఆ తరువాత సామ్ ఆరోగ్యంపై డిప్రెషన్ మూడ్స్ ఎఫెక్ట్ చూపెట్టిందని, దాంతో ఆటో ఇమ్యూన్ దెబ్బతిన్నదని, ఈ కారణంగానే కండరాలు బలహీనపడటం.. అలసట రావడం, నొప్పి ఉండటం వంటి లక్షణాలు వచ్చాయని కొందరు అంటుంటే.. మరికొందరు ఇంకో రీజన్ చెప్తున్నారు. జిమ్ వర్కౌట్స్ ఎక్కువగా చేయటంతో సమంతకి ఈ వ్యాధి వచ్చిందని అని అంటున్నారు.
డివోర్స్ డిప్రెషన్ నుండి బయట పడడానికి సమంత తీవ్రంగా జిమ్ చేసేదని.. అతిగా వ్యాయామాలు చేసే క్రమంలో కండరాలకు అసౌకర్యం కలిగి బలహీనమయ్యాయని.. దాంతో కండరాల్లో మయోసైటిస్ అనే ఇన్ఫెక్షన్స్ సోకిందని చెప్తున్నారు. మరి ఈ రెండు కారణాల్లో ఏది నిజమో కానీ.. నాగచైతన్యతో బ్రేకప్ మాత్రం సమంత ఆరోగ్యానికి హాని చేసిందన్నది మాత్రం అబద్దం కాదు.