Is Shoaib - Sania going to divorce because of model Ayesha?
mictv telugu

సానియా – షోయబ్‌ల మధ్య యూట్యూబర్ చిచ్చు.. అల్లాను చేరేందుకేనని పోస్ట్

November 10, 2022

పతీ పత్నీ ఔర్ వో అనే అనే కాన్సెప్ట్ దంపతుల మధ్య కొత్తేం కాదు. ఇద్దరి బంధం మధ్య మూడో వ్యక్తి చొరబడడంతో కాపురాలు నిట్టనిలువునా కూలిపోతున్న సంఘటనలు మన చుట్టూ ఎన్నో జరుగుతున్నాయి. అరేంజ్డ్ మ్యారేజెస్ విషయాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుండగా, తామేమీ తక్కువ కాదని ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్లు కూడా తెగించేస్తున్నారు. హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ వెటరన్ క్రికెటర్ షోయబ్‌‌లు దేశ సరిహద్దులు చెరిపేసి మరీ ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.

ఇప్పటికి పన్నెండేళలు గడచిపోగా, వీరి దాంపత్యానికి గుర్తుగా ఓ కొడుకు కూడా జన్మించాడు. ఇన్నాళ్లు సజావుగా సాగిన వీరి కాపురంలో ఓ యూట్యూబర్ చిచ్చు పెట్టినట్టు తెలుస్తోంది. మ్యాటర్ చూస్తుంటే విషయం విడాకుల వరకు వెళ్లిందన్న టాక్ వినిపిస్తోంది. విడాకుల గురించి బయట టాక్ నడుస్తున్నా ఇద్దరిలో ఒకరు కూడా స్పందించకపోవడం లేదా ఖండించకపోవడడం చూస్తుంటే బంధం బీటలు వారినట్టేనని కొందరు కన్ఫార్మ్ చేసేస్తున్నారు. దీనికి సానియా పెట్టిన పోస్ట్ ఆజ్యం పోసింది. ‘పగిలిన గుండెలు ఎక్కడికి వెళ్తాయి. అల్లాను చేరేందుకేనా అంటూ ఆమె పెట్టిన పోస్ట్ చూస్తుంటే షోయబ్ వ్యవహారశైలే విడిపోవడానికి కారణమని అంచనా వేస్తున్నారు. దీనంతటికి కారణం మోడల్ అయేషా ఒమర్ అని ఆమెతో షోయబ్ దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. పాకిస్తాన్‌కు చెందిన అయేషా.. కొన్నేళ్ల క్రితం షోయబ్‌‌తో ఫోటోషూట్‌‌లో నటించింది. వాటిని చూస్తే వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందనేలా ఉండడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భర్త ఆమెతో సన్నిహితంగా ఉన్నందున సానియా దూరం పెట్టిందంట. అంతటితో ఆగక ‘పగిలిన హృదయాలు ఎక్కడికి వెళ్తాయి.. అల్లాను చేరేందుకేనా’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఆమె అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిణామంతో షోయబ్ – అయేషా ఫోటోలు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో రూమర్లు మరింత ఎక్కువైపోయాయి.