అంత మీ ఇష్టమేనా?..పవన్ - MicTv.in - Telugu News
mictv telugu

అంత మీ ఇష్టమేనా?..పవన్

April 4, 2022

14

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్‌గా కొత్త జిల్లాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో 13 జిల్లాలుగా ఉన్నా ఏపీ.. ఇకనుంచి 26 జిల్లాలుగా ఏర్పడింది.ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ..” అంత మీ ఇష్టమేనా, ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోరా. ఎవరి నిర్ణయం ప్రకారం.. జిల్లాల విభజన చేశారు. పాలకుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్లారు.

విభజన లోపభూయిష్టంగా సాగింది. జిల్లా డిమాండ్ ఉన్న ప్రాంతాలపై ప్రభుత్వం అధ్యయనం కూడా చేయలేదు. జిల్లాల విభజనతో ముంపు మండలాల గిరిజనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయి. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ జరిగిన తర్వాత కూడా అవి తప్పడం లేదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.

అంతేకాకుండా రంపచోడవరం జిల్లా కేంద్రంగా ఉండాలన్న గిరిజనుల అభిప్రాయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ విమర్శించారు. రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని, మదనపల్లె, హిందూపురం, మార్కాపురం జిల్లా కేంద్రాలుగా ఉండాలని ప్రధాన డిమాండ్లు వచ్చాయన్నారు. ఈ విషయంలో ప్రజల నిరసనకు జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.