Is there no hero in Telugu?..This hero was brought by: Santhosh Shobhan
mictv telugu

తెలుగులో హీరోలెవరు లేరా?..ఈ హీరోను రప్పించారు: సంతోష్ శోభన్

August 3, 2022

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ హీరోగా తెలుగు దర్శకుడు హను రాఘవపూడి తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘సీతారామం’. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా, రష్మిక మందన, సుమంత్, తరుణ్ భాస్కర్ ఓ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఆగస్టు 5న తెలుగు, తమిళ్, మాలయాళం భాషల్లో విడుదల కానుంది. అయితే, ‘సీతారామం స్వరాలు’ అనే పేరుతో చిత్రబృందం హైదరాబాద్‌లో గతరాత్రి మ్యూజికల్ కాన్సెర్ట్ నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ గెస్ట్‌గా విచ్చేయగా, టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సంతోష్ శోభన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ”తెలుగు చిత్రం కోసం మలయాళ హీరోని తీసుకురావాలా? తెలుగులో హీరోలెవరు లేరా? మలయాళ ఆర్టిస్టులు లేకుండా మేం తెలుగు సినిమాలు చేయలేమా? ‘ అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కానీ, ఆ వ్యాఖ్యలు సీరియస్‌గా అన్నవి కావట. ఓ పథకం ప్రకారం ‘సీతారామం’ సినిమాను ఉద్దేశిస్తూ, చాలా సరదాగా అన్న మాటలు అట. ప్రస్తుతం సంతోష్ శోభన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో..”ఈ వేడుకకు వచ్చే ముందు సంతోష్ శోభన్, నటి మాళవిక నాయర్ ‘సీతారామం’ గురించి ఏమనుకున్నారో సీక్రెట్‌గా చిత్రీకరిస్తారు యాంకర్ సుమ. ఆ వీడియోను కార్యక్రమంలో అందరి ముందు ప్రదర్శిస్తారు. అనంతరం, సంతోష్, మాళవికలను సుమ వేదికపైకి ఆహ్వానిస్తారు. ఇదంతా వారు కావాలనే చేశారని తెలిసిపోతుంది. అయినా, సంతోష్ ఒప్పుకోరు. ‘తెలుగు సినిమాల గురించి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తేనే దుల్కర్ మనవాడు అనుకుంటా’ అంటూ హంగామా చేశారు. ఈ పరీక్షలో దుల్కర్ పాసయ్యారు.”