is yashoda movie budget is above samantha market
mictv telugu

మెగాస్టార్ కే దిక్కులేదు, సమంత ఎంతా.. యశోద సామ్ ని ముంచేస్తుందా ?

November 8, 2022

ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‎తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన సమంత పేరు.. విడాకుల తరువాత దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. క్షణాల్లో సమంత పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామ్ అప్డేట్స్ కోసం నిత్యం కోట్ల సంఖ్యలో నెటిజన్స్ సెర్చ్ చేస్తుంటారు. ఈ సందర్భంగా తానూ మయోసైటిస్ వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు అనౌన్స్ చేసి అభిమానులకు షాకిచ్చింది సమంత. అయితే సరిగ్గా యశోద చిత్రం విడుదల సమయంలోనే ఈ వార్త బయటికి రావటంతో మూవీకి కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న యశోద చిత్ర విశేషాల కంటే.. సమంత అనారోగ్య వార్తలపైనే చర్చ ఎక్కువగా నడుస్తుంది. ఈ నేపథ్యంలో యశోద చిత్రం గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. అదే యశోద మూవీ బడ్జెట్. ఈ చిత్రానికి సుమారుగా 40కోట్ల వరకు ఖర్చుయినట్టు తెలుస్తుంది. కేవలం సమంత మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే ఇన్ని కోట్లు పెట్టారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

ఎందుకంటే స్టార్ హీరోల సినిమాలకు కూడా 30కోట్ల బ్రేక్ ఈవెన్ కష్టమైనా ఈ తరుణంలో.. హీరోనే లేని సమంత యశోద సినిమాకి 40కోట్లపైన కలెక్షన్స్ వస్తాయా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటికి మొన్న మెగాస్టార్ గాడ్ ఫాదర్ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. అయితే లాభాల మాట అటుంచి.. ఈ మూవీ కనీసం బ్రేక్ ఈవెన్ క్రాస్ చేయకుండానే నష్టాల్లో ముగిసింది. హిట్ టాక్ వచ్చిన చిరంజీవి సినిమాలే బాక్సాఫీస్ దెగ్గర చతికిలపడుతుంటే సమంత సినిమాకి 40కోట్లు రావటం కష్టమే అంటున్నారు ట్రేడ్ నిపుణులు. అయితే యశోద సినిమాను ఇనీషియల్ స్టేజ్‌లో జస్ట్ 3 కోట్ల బడ్జెట్‌ తో ఫినిష్ చేయాలని మొదటగా మేకర్స్ భావించినా.. సామ్ ఎంట్రీతో పాన్ ఇండియా రేంజ్‌ కు తీసుకెళ్లాలని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ ఫిక్స్ అయ్యారట. తనకు కూడా.. యశోదలో సరోసగసి స్కామ్‌ అనే పాయింట్ నచ్చటం.. ఈ కథ త్రూ అవుట్ ఇండియా సేలబుల్ పాయింట్‌ లాగా అనిపించడంతో.. ఈ సినిమాని రిచ్ గా తీద్దామని నిర్మాతతో దాదాపు రూ. 40 కోట్లు ఖర్చుపెట్టించిందట సమంత. చూద్దాం మరి సమంత అనుకున్నట్టు 40కోట్లు కలెక్ట్ చేసి యశోద రికార్డులని సృష్టిస్తుందో లేక నిర్మాతలని ముంచేస్తుందో. ఇక నవంబర్ 11న యశోద సినిమా విడుదల కానుండగా ప్రమోషన్లను వేగవంతం చేసింది యశోద చిత్ర యూనిట్.