కవలలకు జన్మనిచ్చిన ఇషా అంబానీ.. మొత్తం మెంబర్స్ ఎంతంటే - MicTv.in - Telugu News
mictv telugu

కవలలకు జన్మనిచ్చిన ఇషా అంబానీ.. మొత్తం మెంబర్స్ ఎంతంటే

November 21, 2022

అపర కుబేరుడు ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చింది. దీంతో అంబానీ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. ఇషా అంబానీకి 2018లో ఆనంద్ పిరమిల్ ను వివాహం చేసుకుంది. ఇషా కూడా కవల కావడం గమనార్హం. సోదరుడు ఆకాశ్ అంబానీతో కలిసి 1991 అక్టోబర్ 23న ఇషా జన్మించింది. ఇక మొత్తం కుటుంబసభ్యులను చూస్తే ధీరూబాయ్ అంబానీకి నలుగురు పిల్లలు. వారిలో పెద్దవాడు ముఖేష్ అంబానీ. అనిల్ అంబానీ, నీతా కొఠారి, దీప్తి సలోంకర్ లు మిగతావారు.

ముఖేష్ అంబానీకి ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఇషా. పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ శ్లోకా మెహతాను పెళ్లి చేసుకున్నారు. వీరికి పృథ్వీ అనే కుమారుడు సంతానం. ముఖేష్ చిన్న కుమారుడు అనంత్ అంబానీ 1995 ఏప్రిల్ 10న జన్మించగా, ఇతని ప్రేయసి పేరు రాధిక మర్చంట్. రిలయన్స్ కి చెందిన గ్రీన్ బిజినెస్ కంపెనీలో డైరెక్టరుగా పని చేస్తున్నారు. ఇక మొత్తంగా చూస్తే ముఖేష్ అంబానీ కుటుంబసభ్యుల సంఖ్య పదికి చేరింది.