తప్పు చేసి, జరిమానా కట్టిన బాలీవుడ్ హీరో.. - MicTv.in - Telugu News
mictv telugu

తప్పు చేసి, జరిమానా కట్టిన బాలీవుడ్ హీరో..

April 16, 2019

నిబంధనలు సామాన్యులకైనా, సెలెబ్రిటీలకైనా సమానమే అని నిరూపించారు ముంబై ట్రాఫిక్ పోలీసులు. ‘ధడక్’ సినిమాతో హీరోగా బాలీవుడ్ బోణీ కొట్టిన ఇషాన్ ఖట్టర్ గుర్తున్నాడు కదా. అతను స్టార్ హీరో షాహిద్ కపూర్‌కు తమ్ముడే. అతను ఇటీవల టింగురంగా అంటూ  బాంద్రాలోని ఓ రెస్టారెండుకు బైక్‌పై వచ్చాడు. షార్ట్ వేసుకుని, టీ షర్టు, ముఖం కనిపించకుండా స్క్రాఫ్ చుట్టుకుని హెల్మెట్ పెట్టుకుని వచ్చాడు.

Ishaan Khatter parked his bike in a no parking zone and here's what the Mumbai traffic police did; Watch

తన బైకును నో పార్కింగ్ ప్లేస్‌లో పార్కింగ్ చేసి హోటల్లోకి వెళ్లాడు. అది గమనించిన పోలీసులు ఆ బైకును ట్రక్కులోకి ఎక్కించారు. ఈ విషయాన్ని రెస్టారెంట్‌ సిబ్బంది ఇషాన్‌కు చెప్పడంతో అతను వెంటనే బయటకు వచ్చాడు. ఎంత జరిమానా అయినా కడతానని, బైక్‌ను మాత్రం తీసుకెళ్లొద్దని పోలీసులను కోరాడు. దాంతో పోలీసులు అతనికి రూ.500 జరిమానా విధించి బైక్‌ను అప్పగించారు. ఇదంతా వీడియో తీసిన ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ మానవ్‌ మంగ్లానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీంతో అది కాస్తా వైరల్‌ అవుతోంది. ఇషాన్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందబోయే ఓ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.