ఐసిస్ చీఫ్ బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు.. ట్రంప్! - MicTv.in - Telugu News
mictv telugu

ఐసిస్ చీఫ్ బాగ్దాదీ కుక్క చావు చచ్చాడు.. ట్రంప్!

October 27, 2019

ISIS Leader abu bakr al-Baghdadi nomore in US raid, Says Donald Trump 

వరల్డ్‌ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, ఇస్లామిక్ లీడర్ అబూ బకర్ బాగ్దాదీ మృతిచెందాడని ఉదయం నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్రువీకరించారు. సిరియాలో జరిగిన యుఎస్ దళాల ఆపరేషన్‌లో  ఐసిస్ అగ్రనాయకుడు అబూ బకర్ బాగ్దాదీ మట్టికరిచాడని ట్రంప్ స్పష్టంచేశారు. దీనిపై ట్రంప్ మాట్లాడుతూ.. బాగ్దాదీ తననుతానే పేల్చుకుని చనిపోయాడని ట్రంప్ తెలిపారు. ఈ దాడిలో బాగ్దాదీతో పాటు తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కొన్నారు. 

అమెరికా భద్రతా దళాలు బాగ్దాదీని వెంబడించిన సమయంలో.. అతను తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మాహుతి చేసుకున్నాడని వివరించారు. వేలాదిమంది అమాయకులను తన ఉగ్ర కార్యకలాపాలతో చంపిన బాగ్దాదీ చివరికి కుక్కచావు చచ్చాడని అన్నారు. చివరి క్షణంలో అతను ఎంతో పిరికివాడిగా మారాడని చెప్పారు. ఇప్పుడు ప్రపంచం అంతా సురక్షితంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. బాగ్దాదీ హతం కావడంతో భారత్‌తో పాటు ఉగ్రవాద బాధిత దేశాలు హర్షం వ్యక్తంచేస్తున్నాయి.