భారత్‌కు డెడ్‌లైన్ విధించిన ఇస్లామాబాద్ హైకోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌కు డెడ్‌లైన్ విధించిన ఇస్లామాబాద్ హైకోర్టు

March 4, 2022

 

004

పాకిస్తాన్‌లొ ఖైదీగా ఉన్న కుల్ భూషణ్ జాదవ్ కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు గురువారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఏప్రిల్ 13 లోగా జాదవ్ తరపున వాదనలు వినిపించేందుకు భారత్ న్యాయవాదిని నియమించాలని, సదరు న్యాయవాది కోర్టుకొచ్చి వాదనలు వినిపించాల్సి ఉంటుందని వెల్లడించింది. కాగా, గూఢచర్యం కేసులో పాకిస్తాన్ 2017లో జాదవ్‌కు మరణ శిక్ష విధించింది. అనంతరం భారత్ అంతర్జాతీయ కోర్టుకెళ్లి శిక్ష అమలును అడ్డుకుంది. 2019లో తీర్పును సమీక్షించాలని అంతర్జాతీయ న్యాయస్థాన ఆదేశాలతో ఇస్లామాబాద్ హైకోర్టు విచారణ చేపట్టింది. 2020లో జాదవ్ తరపున వాదించడానికి పాకిస్తాన్ న్యాయవాదిని నియమించాలని తీర్పిచ్చింది. అయితే భారత్ ఆ తీర్పును వ్యతిరేకిస్తూ.. తమ దేశం నుంచే న్యాయవాదిని పంపించి వాదనలు వినిపిస్తామని పరోక్షంగా ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో జరిగిన తాజా విచారణలో ఆ దేశ అటార్నీ జనరల్ ఖలీద్ జావేద్ మాట్లాడుతూ భారత్ కావాలనే జాప్యం చేస్తోందనీ, తద్వారా పాక్ ఉల్లంఘనలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ అంతర్జాతీయ కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం గడువు తేదీలోగా న్యాయవాదిని నియమించాలని తెలిపింది.