Islamic fundamentalists chased women Afghanistan who protesting ban
mictv telugu

అమ్మాయిలపై తాలిబన్ల కొరడా.. వర్సిటీలోకి రాకుండా తరిమికొడుతూ..

November 2, 2022

మహిళల హక్కులకు భంగం కలిగించబోమని హామీ ఇచ్చిన అఫ్ఘానిస్తాన్ తాలిబన్లు ప్రతాపం చూపిస్తున్నారు. అమ్మాయిలు చదువుకోకూడదంటూ విద్యాసంస్థల నుంచి తరిమికొడుతున్నారు. ఇప్పటికే బురఖా తప్పనిసరి, ఇళ్ల నుంచి బయటికి రావొద్దని, వాహనాలు నడపొద్దని, సగం జీతాలకే పనిచేయాలని ఆంక్షలు అమలు చేస్తున్న ఛాందసవాదులు తాజాగా యూనివర్సిటీల నుంచి వెళ్లగొట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వచ్చింది.

తమకు చదువుకోవాలని ఉందని కొంతమంది యువతులు యూనివర్సటీ గేటు దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను లోపలికి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. చాలామంది బురఖాలు ధరించి వున్నా తాలిబన్లు లోనికి అడుగు పెట్టనివ్వలేదు. గేటు దగ్గర గుమికూడిన విద్యార్థులపై ఓ తాలిబన్ హూంకరిస్తూ తరిమికొట్టాడు. అతడు ‘పాప పుణ్యాల’ మంత్రిత్వ శాఖ అధికారి అంట. ఈశాన్య అఫ్ఘాన్‌లోని బదక్షన్ యూనివర్సిటీ వద్ద ఈ సంఘటన జరిగింది. అమ్మాయిలు ఆరో తరగతి వరకు మాత్రమే చదువుకోవాలని తాలిబన్లు ఆదేశాలు జారీ చేయడంతో ఆపై స్థాయి విద్య దేశంలో అందుబాటులో లేదు.