ఇస్మార్ట్ శంకర్‌కు బీరుతో అభిషేకం - MicTv.in - Telugu News
mictv telugu

ఇస్మార్ట్ శంకర్‌కు బీరుతో అభిషేకం

July 18, 2019

 

తమ హీరో సినిమా రిలీజ్ అయిందంటే చాలు అభిమానుల హడావిడి మామూలుగా ఉండదు. కొంత మంది పాలాభిషేకం.. మరికొంతమంది రక్తాభిషేకం చేస్తారు. నెయ్యి, పెరుగు కూడా ఉత్తి పుణ్యానికి వృథా చేస్తుంటారు. ఇదే కోవలో ‘ఇస్మార్ట్ శంకర్’ హీరో రామ్ చిత్రపటానికి ఓ అభిమాని బీర్‌తో అభిషేకం చేసి అందరిని ఆశ్చర్యపరిచాడు. విశాఖలోని జగదాంబ థియేటర్‌లో ఓ అభిమాని ఇలా వెరైటీగా అభిషేకం చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  దీన్ని చూసిన పూరి జగన్నాథ్ ‘మార్ ముంత’ అనే క్యాప్షన్ తో ఇది ఇస్మార్ట్ ఆలోచన అంటూ వీడియోను షేర్ చేశారు. ఇదిలా ఉంటే హీరో రామ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ నేడు విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తోంది.