తెలంగాణలో ప్రమాదకర వేరియంట్.. కనుగొన్న ఇజ్రాయెల్ సైంటిస్ట్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ప్రమాదకర వేరియంట్.. కనుగొన్న ఇజ్రాయెల్ సైంటిస్ట్

July 5, 2022

వ్యాక్సిన్లు వేసినా ఇంకా కరోనా ముప్పు తొలగిపోలేదు. స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా ఇంకా దేశంలో కొనసాగుతోంది. తాజా లెక్కల ప్రకారం దేశంలో కొత్తగా 13,086 కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 24 మంది మరణించారు. ఈ నేపథ్యంలో మరో ఆందోళనకర విషయం వెలుగు చూసింది. కరోనా వైరస్‌కు సంబంధించి కొత్త సబ్ వేరియంట్‌ను గుర్తించినట్టు ఇజ్రాయెల్ శాస్త్రవేత్త షే ఫ్లీషాన్ వెల్లడించారు. దాదాపు పది రాష్ట్రాల్లో బీఏ.2.75 సబ్ వేరియంట్ ఉందని ట్వీట్ చేశారు. జులై రెండో తేదీ నాటికి మహారాష్ట్రలో 27, పశ్చిమ బెంగాల్‌లో 13, హర్యానాలో 6, కర్ణాటకలో 10, మధ్యప్రదేశ్‌లో 5, తెలంగాణలో 2, ఢిల్లీ, జమ్ము, ఉత్తరప్రదేశ్‌లలో ఒక్కో కేసులు వెలుగు చూశాయి. మొత్తం కలిపి 69 కేసులు రాగా, ఈ వేరియంట్ రాబోయే కాలంలో ఆందోళనకరంగా మారే అవకాశముందని ఆయన హెచ్చరించారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో మాస్కు ధరించడం తప్పనిసరి చేశారు. నిబంధనలకు అతిక్రమించిన వారికి రూ. 1000 జరిమానా విధిస్తామని సంబంధిత శాఖ అధికారి ఇప్పటికే తెలియజేశారు.