ఆడ, మగ ఇద్దరూ కలిస్తేనే పిల్లలు పుడతారనేది ప్రకృతి ధర్మం. కానీ, కాలక్రమేణా పిల్లలు పుట్టడానికి వేర్వేరు పద్ధతులు పుట్టుకొచ్చాయి. అందులో ఐవీఎఫ్ ఒకటి. అయితే ఇప్పుడు అలాంటి వాటి అవసరం లేకుండా కృత్రిమంగా మనుషులను పుట్టించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు అద్భుతాన్ని కనుగొన్నారు. వీర్య కణాలతో పనిలేకుండా ఓ కృత్రిమ పిండాన్ని సృష్టించారు. ఇందుకు తల్లి గర్భం కూడా అవసరం లేదు. ఓ చిన్న పాత్రలో సింథటిక్ పొరను ఏర్పరిచి, అందులో తల్లి గర్భంలోని వాతావరణాన్ని క్రియేట్ చేశారు. అందులో కేవలం రక్తకణాలతోనే ఓ పిండాన్ని అభివృద్ధి చేశారు. దీనితో కణజాలంతో పాటు శరీర భాగాలు వృద్ది చెందాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా కృత్రిమ పిండాన్ని రూపొందిండం ప్రపంచంలో ఇదే తొలిసారి.