మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ఇజ్రాయిల్ మీడియా ఎంత లెవల్లో రాసిందంటే… చద్వితే ఆయనకు ఆయననే ఆశ్చర్యపోయేటట్లు రాసిందట. రాతలు సంగతి అట్లా ఉంచితే… ఆయన కోసం జెరూసలెంలో ఆయన కోసం ఏర్పాటు చేసిన హోటల్ గది….ప్రత్యేకత వింటే నోరెళ్లబెట్టాల్సిందే. జెరూసలెంలో ని కింగ్ డేవిడ్ హోటల్ లో ప్రధాని మోదీ బస చేస్తున్నారు. ఆయన కోసం అన్ని హంగులతో సూట్ ఏర్పాటు చేశారు. ఆయన వెంట వెళ్లిన సిబ్బంది కోసం 110 గదులు కేటాయించారు.
ఇందులో వింత లేక పోవచ్చు. మోడీ గదికి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది. ఆయన నివాసం ఉన్న సూట్ ను బాంబులతో దాడీ చేసిన ఏమీ కాదట. అంతే కాదు రసాయనిక దాడులు చేసిన కూడా ఏమీ కాదట. ఇట్లా ఎన్ని రకాలుగా దాడులు చేసిన కూడా చెక్కు చెదరని గదిని ఏర్పాటు చేశారట. చానా ఏండ్ల తర్వాత మోడీ అక్కడికి వెళ్లాడు కదా. పైగా మోడీ గురించి వాళ్లే రాసుకున్నరు మీడియాలో. కాబట్టి అదిరి పోయే ఏర్పాట్లు చేశారు.
ఇలాంటి గదిని ప్రపంచంలో అమెరికా ఇప్పటి అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, బుష్, ఒబామాలు మాత్రమే ఉన్నారట. ఆ తర్వాత మోడీకే ఆ అవకాశం దక్కింది. అంతే కాదు గుజరాత గుమగులు కూడా ఏర్పాటు చేశారట. ఏదంటే అది నిముషాల్లో చేసి పెట్టే వంట వాళ్లను కూడా పెట్టారట. అన్నట్లు అక్కడ పువ్వుకు మోడీ పేరు కూడా పెట్టారు. క్రైసాంతిమమ్ అనే పువ్వుకే మోడీ పేరు పెట్టింది.