ఇజ్రాయెల్ ప్రధానికి కరోనా పరీక్షలు.. ప్రభుత్వ వర్గాల్లో గుబులు - MicTv.in - Telugu News
mictv telugu

ఇజ్రాయెల్ ప్రధానికి కరోనా పరీక్షలు.. ప్రభుత్వ వర్గాల్లో గుబులు

March 31, 2020

Israel's Netanyahu tests negative for coronavirus, remains in isolation

కరోనా వైరస్ ఎవ్వరినీ వదిలిపెట్టడంలేదు. దీంతో రకరకాల పుకార్లు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూకు కరోనా సోకిందని ప్రచారం జరిగింది. దీంతో ఆయన కరోనా పరీక్షలు చేసుకున్నారు. నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు వైరస్ సోకలేదని వెల్లడైంది. నేతన్యాహూ కుటుంబ సభ్యులకు, ఇతర సలహాదారులకు కూడా కరోనా పరీక్షలు జరపగా ఎవరికీ కరోనా సోకలేదని తేలింది.

అందరి రిపోర్టుల్లోనూ నెగెటివ్ అని వచ్చింది. దీంతో అధికార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. తొలుత ప్రధాని సహాయకుడికి కరోనా సోకిందని.. అతని ద్వారా ప్రధానికి కూడా కరోనా సోకిందని అనుకున్నారు. దీంతో నేతన్యాహూ సహాయకురాలు, ఆమె భర్త కరోనా బారిన పడ్డారని తెలిసిన వెంటనే ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాల్లో గుబులు చెలరేగి ఎట్టకేలకు చల్లబడ్డారు. అయితే ప్రధాని మరికొన్ని రోజులు క్వారెంటైన్‌లో ఉంటారని తెలుస్తోంది. 

కాగా, బ్రిటన్‌ రాజకుమారుడు చార్లెస్‌, ప్రధానమంత్రి బొరిస్‌ జాన్సన్‌, ఆరోగ్యశాఖ మంత్రికి కోవిడ్‌–19 సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 86 ఏళ్ళ స్పెయిన్‌ యువరాణి మారియా థెరీసా కరోనా వైరస్ సోకి మృతిచెందారు. పారిస్‌లో ఆమె చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.