ఇస్రో మరో ప్రయోగం.. శ్రీవారి సేవలో శివన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఇస్రో మరో ప్రయోగం.. శ్రీవారి సేవలో శివన్

November 26, 2019

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన ఈ కౌంట్‌డౌన్‌ 26 గంటలపాటు కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు దీన్ని నింగిలోకి పంపనున్నారు. ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రయోగం విజయవంతం కావాలని స్వామి వారిని కోరుకున్నారు. 

ISRO.

ఈసారి రాకెట్ ద్వారా ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్‌-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. దీంట్లో అమెరికాకు చెందిన 13 కమర్షియల్‌ నానో ఉపగ్రహాలు పంపనున్నారు. షార్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రయోగం 74వది కాగా.. పీఎస్‌ఎల్‌వీ సీ-47 ప్రయోగం. గత అనుభవాల దృష్ట్యా విజవంతంగా ఉపగ్రహాలను రోదసిలోకి పంపించేందుకు శాస్త్రవేత్తలు సిద్ధం అయ్యారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని శివన్  ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ ఏడాది పంపిన చంద్రయాన్ 2 ప్రయోగం కాస్త నిరాశపరిచిన సంగతి తెలిసిందే.