చంద్రయాన్-2.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో.. - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రయాన్-2.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో..

June 12, 2019

ISRO releases first pictures of Chandrayaan-2 at Bengaluru Satellite Integration and Testing facility.

జూలై 9 నుంచి 16 మ‌ధ్య జరగనున్న చంద్రయాన్-2 ప్రయోగం కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. పరికారలను సిద్ధం చేసే పనిలో బెంగుళూరు శాటిలైట్ ఇంటిగ్రేష‌న్ అండ్ టెస్టింగ్ సెంట‌ర్‌ తలమునకలై వుంది.  2009లో చంద్ర‌యాన్ 1ను ఇస్రో ప్ర‌యోగించిన విషయం తెలిసిందే. తిరిగి పదేళ్ల తర్వాత ఇప్పుడు చేస్తున్న చంద్రయాన్-2 ప్రయోగం విశేషంగా మారింది.

కాగా, చంద్ర‌యాన్‌-2కు సంబంధించిన ఫోటోల‌ను ఇవాళ ఇస్రో విడుదల చేసింది. చంద్రయాన్-2 మిషన్ 2019 సెప్టెంబ‌ర్ 6న చంద్రుడిపై దిగే అవ‌కాశాలు ఉన్నాయి. ఆర్బిటార్‌, ల్యాండ‌ర్‌(విక్ర‌మ్‌), రోవర్‌(ప్ర‌జ్ఞన‌) మాడ్యూళ్ల‌ను చంద్ర‌యాన్‌2 ద్వారా లాంచ్ చేయ‌నున్నారు. చంద్ర‌యాన్ 2 ప్ర‌యోగం ద్వారా 11 పేలోడ్స్ కూడా తీసుకువెళ్ల‌నున్నారు. ఇందులో ఇండియాకు చెందిన‌వి ఆరు, యూరోప్‌వి మూడు, అమెరికావి రెండు ఉంటాయి.

జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ ద్వారా ప్ర‌యోగం జ‌రుగుతుంది. ఆర్బిటార్ ప్రొప‌ల్‌ష‌న్ మాడ్యూల్ ద్వారా మూన్ ఆర్బిట్‌లోకి శాటిలైట్ ప్ర‌వేశిస్తుంది. ఆ త‌ర్వాత ఆర్బిటార్ నుంచి ల్యాండ‌ర్ వేరు అవుతుంది. చంద్రుడిపైన ఉన్న ద‌క్షిణ ద్రువంలో ల్యాండర్ దిగుతుంది. శాస్త్రీయ ప‌రీక్షల కోసం రోవ‌ర్ అక్క‌డ సంచ‌రిస్తుంది.