చంద్రయాన్-2 తాజా చిత్రాలు విడుదల చేసిన ఇస్రో - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రయాన్-2 తాజా చిత్రాలు విడుదల చేసిన ఇస్రో

October 5, 2019

ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండ్ చంద్రుడి ఉపరితలాన్ని చేరుకోనప్పటికీ ఆర్బిటర్ మాత్రం తన సేవలను కొనసాగిస్తుంది. తాజాగా ఆర్బిటర్ పంపిచిన చిత్రాలను శాస్త్రవేత్తలు విడుదల చేశారు. హై రిజల్యూషన్‌ కెమెరాతో చంద్రుడిపై ఉన్న పరిస్థితులకు సంబంధించిన ఫొటోలను పంపిచింది. చంద్రుడిపై నైసర్గిక స్వరూపం అధ్యయనం చేయడానికి ఈ ఫొటోలు ఎంతో కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ISRO.

సెప్టెంబరు 5న చంద్రుడి నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఆర్బిటర్‌ ఈ ఫొటోలు తీసిందని వెల్లడించారు. ఈ చిత్రంలో కొన్ని బిలాలను కూడా గుర్తించారు. ఇందులో 5 మీటర్ల కన్నా తక్కువ వ్యాసమున్న రెండు చిన్న బిలాలను, 2 మీటర్ల ఎత్తున్నటువంటి బండరాళ్లను ఇస్రో గుర్తించింది.దక్షిణ ధ్రువాన మూడు కిలోమీటర్ల లోతుతో ఉన్నత బోగుస్లాస్కై  బిలాన్ని కూడా గుర్తించారు. భవిష్యత్‌లో ఆర్బిటర్ నుంచి మరింత సమాచారం అందే అవకాశం ఉందని ఇస్త్రో చెబుతోంది.