చంద్రయాన్-2.. ఎప్పుడో చెప్పిన ఇస్రో - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రయాన్-2.. ఎప్పుడో చెప్పిన ఇస్రో

July 18, 2019

ఈ నెల 15న జరగాల్సిన భారత ప్రతిష్ఠాత్మక అంతరిక్ష ప్రాజెక్ట్ చంద్రయాన్-2 సాంకేతిక లోపంతో ఆగిపోయిన సంగతి తెలిసిందే. క్రయోజనిక్ స్టేజ్ లోపంతో ఈ ప్రాజక్టు ఆగిపోయింది. ఇదే నెల 22, సోమవారం నాడు చంద్రయాన్-2 నిర్వహించనున్నట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో వెల్లడించింది. 

ఈ మేరకు ఇస్రో ట్విట్టర్ ఖాతాలో అధికారిక ప్రకటన చేసింది. జూలై 22, మధ్యాహ్నం 2.43 గంటలకు చంద్రయాన్-2 రాకెట్ ప్రయోగం ఉంటుందని తెలిపింది. రాకెట్‌లో కనుగొన్న సాంకేతిక లోపాలను ఇప్పటికే సవరించామని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈసారి ఎటువంటి ఆటంకాలు కలుగకుండా రాకెట్ ప్రయోగం జరగాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు.