ISRO successfully launches its new SSLV-D1 rocket from Sriharikota
mictv telugu

చరిత్ర సృష్టించిన ఇస్రో.. నింగిలోకి దూసుకెళ్లిన SSLV D1

August 7, 2022

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. శ్రీహరి కోట నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన SSLV D1 రాకెట్ ఇప్పటి వరకు మూడు దశలను విజయంవంతంగా పూర్తిచేసుకున్నది. అతి తక్కువ ఖర్చుతో రూపొందించిన SSLV D1 రాకెట్ ఆదివారం ఉదయం 9.18 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కేవలం 13.2 నిమిషాల్లో కక్ష్యలోకి చేరింది. ఈఓఎస్ 02, అజాదీశాట్ ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. అజాదీ కా అమృత్ మహోత్సవ వేళ ఈ చిన్న శాటిలైట్ వెహికిల్‌ను ఇస్రో ప్రయోగించి చరిత్ర సృష్టించింది. 75 స్కూళ్ల విద్యార్థినులు అజాదీశాట్ ఉపగ్రహాన్ని రూపొందించారు.

34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించారు. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేయగా.. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేశారు.నాలుగో దశలో 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్‌–2ఏ(ఈఓఎస్‌శాట్‌)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెట్టారు.