నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ -సీ74 రాకెట్ - MicTv.in - Telugu News
mictv telugu

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ -సీ74 రాకెట్

November 27, 2019

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నుంచి మరో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట సతీష్ దావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్‌ఎల్‌వీ- సీ 47 వాహక నౌక విజయవ వంతంగా నింగిలోకి వెళ్లింది. వాహక నౌక విజయవంతంగా వెళ్లడంతో శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. దీంట్లో మొత్తం 14 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లగా అమెరికాకు చెందినవే 13 ఉన్నాయి.

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టోశాట్‌-3ని మన శాస్త్రవేత్తలు తయారు చేశారు. రాకెట్ తీసుకెళ్లిన ఈ ఉపగ్రహాలు భూవాతావరణం, విపత్తులనుకు సంబంధించిన హెచ్చరికల సమాచారాన్ని చేరవేయనుంది. వివిధ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల నెట్‌వర్క్‌ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి ఇది ఉపయోగపడనుంది. కార్టోశాట్‌-3 ఐదేళ్ల పాటు తన సేవలను అందించనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో మొత్తం రూ. 350 కోట్లు ఖర్చు చేసింది.