Istanbul Criminal Court sentenced Muslim preacher to 8,658 years in prison
mictv telugu

ముస్లిం ప్రబోధకుడికి 8,658 ఏళ్ల జైలుశిక్ష.. చేసిన నేరం ఇదీ

November 16, 2022

టర్కీలో అద్నాన్ అక్తర్ అనే ముస్లిం మత ప్రబోధకుడికి అక్కడి ఇస్తాంబుల్ కోర్టు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 8 వేల 6 వందల 58 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 66 ఏళ్ల అద్నాన్ 2018 నుంచి జైలులోనే ఉన్నాడు. టీవీ షోలలో భారీ మేకప్ వేసుకొని, పొట్టి దుస్తులు వేసుకున్న మహిళల మధ్య కూర్చుని మతపరమైన చర్చలు నిర్వహించేవాడంట.

అయితే మహిళలపై లైంగిక దాడులు, మైనర్లపై లైంగిక వేధింపులు, మోసం, ఆర్మీపై నిఘా వంటి కేసుల్లో ఆయనకు గతేడాదే కోర్టు 1,075 సంవత్సరాల శిక్ష విధించింది. కానీ, ఈ తీర్పును ఇస్తాంబుల్ క్రిమినల్ కోర్టు కొట్టేసి కేసును మళ్లీ విచారించింది. అద్నాన్‌తో పాటు మరో పదిమంది అనుచరులకు కలిపి ఏకంగా 8,658 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.