Istanbul police arrest new ISIS chief Qureshi
mictv telugu

ఇస్తాంబుల్‌లో రహస్య ఆపరేషన్.. ఐసిస్ కొత్త చీఫ్ అరెస్ట్

May 27, 2022

Istanbul police arrest new ISIS chief Qureshi

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ కొత్త చీఫ్ అబు అల్ హసన్ అల్ ఖురేషీ రహస్య ఆపరేషన్‌లో పోలీసులకు చిక్కాడు. టర్కీలోని ఇస్తాంబుల్ పోలీసులు, యాంటీ టెర్రరిస్ట్ విభాగాల నేతృత్వంలో నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో కొత్త చీఫ్‌ను అరెస్ట్ చేసినట్టు టర్కీ న్యూస్ వెబ్‌సైట్ పేర్కొంది. ఈ విషయాన్ని అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు దళాలు చేరవేశాయని, త్వరలో ఆయన అధికారికంగా వెల్లడిస్తారని తెలిపింది.

కాగా, ఖురేషీ ఐసిస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రెండు నెలలకే అరెస్ట్ కావడం గమనార్హం. దీంతో ఐసిస్ ప్రాబల్యం క్రమేపీ తగ్గుతుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019లో అబూ బకర్ అల్ బాగ్దాదీ చనిపోయిన తర్వాత అబూ ఇబ్రహీం అల్ హషిమీ అల్ ఖురేషీ బాధ్యతలు చేపట్టారు. అయితే అమెరికా నిర్వహించిన ఆపరేషన‌లో వారికి చిక్కకుండా ఓ గుహలో దాక్కొని సేనలు సమీపించే కొద్దీ తనను తాను బాంబులతో పేల్చేసుకున్నాడు. దీంట్లో ఆయనతో పాటు ఆయన కుటుంబం కూడా బలైపోయింది. ఇప్పుడు తాజాగా కొత్త చీఫ్ కూడా అరెస్ట్ కావడంతో తదుపరి అధ్యక్షుడు ఎవరైనా వస్తారా? అంటూ ఆరా తీస్తున్నారు.