నిరుద్యోగులకు ఐటీ కంపెనీలు శుభవార్త - MicTv.in - Telugu News
mictv telugu

నిరుద్యోగులకు ఐటీ కంపెనీలు శుభవార్త

May 23, 2022

 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీటెక్ విద్యను పూర్తి చేసుకొని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఐటీ కంపెనీలు శుభవార్తను చెప్పాయి. డిగ్రీతోపాటు కొద్దిపాటి ఐటీ నైపుణ్యం ఉంటే చాలు వారికి తమ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించాయి. ప్రస్తుతం వస్తున్న కొత్త టెక్నాలజీల మీద నాలుగైదేళ్లు పనిచేసిన అనుభవం ఉన్నవారికి భారీ జీతభత్యాలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నాయి. ప్రస్తుతం వార్షిక జీత భత్యాలు రూ. 4 లక్షల నుంచి 45 లక్షలు, ఇంకా పైన కూడా ఉన్నాయని, తెలుగు రాష్ట్రాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగులకు ఈ ఉద్యోగాలు ఎంతో మేలు చేస్తాయని ఐటీ కంపెనీలు సూచించాయి.

”కరోనా కారణంగా ఆన్లైన్/మొబైల్ లావాదేవీలు భారీగా పెరిగాయి. కొవిడ్‌కు ముందు ఐటీ రంగంలో ఏటా 2-2.5 లక్షల కొత్త ఉద్యోగాలు లభించేవి. గత 12 నెలల్లోనే 4.5-5 లక్షల కొత్త ఉద్యోగాలొచ్చాయి. అందులో ఏఐ ఎంఎల్, బ్లాక్‌చైన్, ఏఆర్-వీఆర్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్సెస్, ఓపెన్ టెక్నాలజీల వినియోగం పెరిగింది. హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఎన్నో కంపెనీల కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఒక్కో కేంద్రంలో కనీసం 100 – 500 ఐటీ ఉద్యోగాలు లభిస్తున్నాయి. భారత్ ఐటీ పరిశ్రమ ప్రస్తుతం 227 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. 2030కి 350 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దేశంలో ఐటీ రంగం 50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించగా, ఎనిమిదేళ్లలో 70 లక్షలకు ఈ సంఖ్య పెరిగింది. ఇకపై ఏటా కనీసం 3- 3.5 లక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయి” అని ఐటీ కంపెనీల సీఈఓలు వివరాలు వెల్లడించారు.

ఈ విభాగాల్లోనే ఎక్కువగా కొత్త ఉద్యోగాలు ఉన్నట్లు కంపెనీలు తెలిపాయి. ఏఐ ఇంజినీరింగ్, జనరేటివ్ ఏఐ, డేటా ఫ్యాట్రిక్, డిస్ట్రిబ్యూషన్ ఎంటర్ ప్రైజ్, టోటల్ ఎక్స్పరియన్స్, అటానమస్ సిస్టమ్స్ (సెల్ఫ్ మేనేజింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్), డెసిషన్ ఇంటెలిజెన్స్, హైపర్ ఆటోమేషన్, సైబర్ సెక్యూరిటీమెష్ (సీఎం )