ఒక్క రూపాయికే మీ పెళ్లి చేస్తాం... బంపర్ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఒక్క రూపాయికే మీ పెళ్లి చేస్తాం… బంపర్ ఆఫర్

October 18, 2018

పెళ్లిచేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఆ పనులు ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా పేదల పరిస్థితి మరీ తీసికట్టుగా ఉంటుంది. కట్నకానుకల భారమే కాకుండా భోజనం, షామియానా తదితర ఖర్చుల కోసం అప్పులు చేస్తుంటారు పేదలు. ఈ సమస్యలను దగ్గర్నుంచి చూసిన ఓ వ్యాపారవేత్త పెద్ద మనసుతో ముందుకొచ్చాడు.

rr

ఆర్థిక స్తోమత లేని జంటలు తనకు కేవలం ఒక రూపాయి చెల్లిస్తే వారి పెళ్లి చేయిస్తానని ముందుకొచ్చాడు. అది కూడా తూతూమంత్రం పెళ్లిలా కాకుండా అన్ని సంబరాలు ఉండే వివాహాన్నే జరిపిస్తానంటున్నాడు. అతని పేరు శరత్. చెన్నైలో ‘మై గ్రాండ్ వెడ్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్’ కంపెనీ నడుపున్నాడు. ‘నేను చాలా బాగా గమనించాను. పేదలకు రానురాను పెళ్లి మోయలేని భారంగా మారుతోంది. వారికి కాస్త చేయూత అందించేందకు ప్రతీనెలా మేం కేవలం ఒక రూపాయికే పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాం. దీనికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. పెళ్లికొడుకు,పెళ్లికూతురు నెల జీతం ఐదువేలలోపే ఉండాలి. ఉద్యోగం లేకపోయినా ఫర్వాలేదు. పేదలైతే చాలు. డిసెంబర్ నుంచి ఈ పెళ్ళిళ్లు చేస్తాం.. ’ అని శరత్ చెప్పాడు.