కోట్లకు కోట్లు సంపాదిస్తున్నా చాలా మంది ఆదాయ పన్నును ఎలా తప్పించుకోవాలా? అని దారులు వెతుకుతారు. కానీ, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ దీనికి భిన్నం. క్రమం తప్పకుండా ఆదాయ పన్ను కడుతుంటాడు. సినిమాలతో పాటు యాడ్ల ద్వారా భారీగా ఆర్జించినా, పన్ను కట్టడంలో వెనుకాడడు. ఈ ఏడాది అతను నటించిన బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాలు ఫ్లాప్ అయినా పన్ను మాత్రం సక్రమంగా కట్టాడంట. దీంతో అతడిని ‘సమ్మాన్ పత్ర’ అవార్డుతో సత్కరించింది ఐటీ శాఖ. అక్షయ్ ప్రస్తుతం బ్రిటన్లో ఉండడంతో ఈ అవార్డును అతని ప్రతినిధికి ఇచ్చారు. అయితే అక్షయ్ ఈ ఏడాది ఎంత పన్ను కట్టాడో మాత్రం ఐటీశాఖ తెలియజేయలేదు.