సోనూ సూద్ ఇళ్లపై ఐటీ దాడులు - MicTv.in - Telugu News
mictv telugu

సోనూ సూద్ ఇళ్లపై ఐటీ దాడులు

September 15, 2021

కరోనా కష్టకాలంలో దేశవ్యాప్తవంగా వేల నిరుపేదలను ఆదుకున్న నటుడు సోనూ సూద్ చిక్కుల్లో పడ్డారు. పన్ను ఎగవేత వ్యహరంలో ఆయనకు చెందిన కొన్ని ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు. సోనూకు చెందిన ఆరు ప్రాంతాల్లో సోదాలు సాగుతున్నాయి. ముంబై, లక్నో తదితర ప్రాంతాల్లో ఐటీ దాడులు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. కొన్ని లావాదేవీలతోపాటు ఓ భారీ రియల్ ఎస్టేట్ లావాదేవీలో తమకు అనుమనాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

సోనూ సూద్ ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కూలు విద్యార్థు మెంటార్షిప్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితుడయ్యాడు. కరోనా అవగాహన కార్యక్రమం కోసం పంజాబ్ ప్రభుత్వం కూడా ఆయన్ను ప్రచారకర్తగా నియమించుకుంది. ఈ రెండు రాష్ర్టాల్లోనూన బీజేపీయేతర పార్టీల అధికారంలో ఉండడం, సోనూ సూద్ త్వరలో రాజకీయాల్లోకూ వస్తారని ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. కరోనా లాక్ డౌన్ వల్ల తిండికి, ప్రయాణ చార్జీలకు నోచుకోని వేలమందిని సోనూసూద్ ఆదుకున్నారు. సినిమాల్లో విలన్ అయినా నిజజీవితంలో హీరో అనిపించుకుని కోట్లమంది అభిమానం చూరగొన్నారు.