మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ సమన్లు.. వివరణ ఇవ్వాలని ఆదేశం - MicTv.in - Telugu News
mictv telugu

మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ సమన్లు.. వివరణ ఇవ్వాలని ఆదేశం

November 24, 2022

తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి ఐటీ శాఖ సమన్లు జారీ చేసింది. ఈ నెల 28, 29 తేదీల్లో మల్లారెడ్డి, అతని బంధువులు విచారణకు రావాలని ఆదేశించింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న డబ్బు, బంగారం, పత్రాల విషయంలో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొంది. పెద్ద సంఖ్యలో సమన్లు ఇవ్వాల్సి రావడంతో మరికొందరికి వేర్వేరు తేదీల్లో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

గత రెండు రోజులు మల్లారెడ్డి నివాసం, మెడికల్, ఇంజినీరింగ్ కాలేజీలు, బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. సోదాల్లో రూ. 15 కోట్ల నగదు, బంగారు నగలు, ఇతర కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటినీ బషీర్ బాగ్ లోని ఐటీ కార్యాలయానికి తరలించారు. అటు తమతో బలవంతంగా బ్లాక్ మనీ ఉన్నట్టు సంతకం చేయించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు.