భారత ఇంజనీర్‌కు లాటరీలో రూ.21కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

భారత ఇంజనీర్‌కు లాటరీలో రూ.21కోట్లు

July 7, 2022

తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఏడాది కాలంగా లాటరీ టికెట్స్ కొంటున్న ఓ ఇండియన్ టెకీ.. ఒకేసారి కోటీశ్వరుడయ్యాడు. అతని కల ఫలించి ఒకేసారి రూ.21 కోట్లు గెలిచుకొని వార్తల్లో నిలిచాడు. ఇండియాలోని కేరళకు చెందిన అనీష్.. దుబాయ్ లో ఐటీ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. దుబాయ్‌లో శనివారం(జూలై 2న) నిర్వహించిన మహజూజ్ డ్రాలో అనీష్ 10 మిలియన్ దిర్హమ్స్(రూ.21కోట్లు) గెలుచుకున్నాడు. తాజాగా దుబాయ్‌లో మహజూజ్ ప్రధాన కార్యాలయంలో దీని తాలూకు చెక్‌ను రాఫెల్ నిర్వాహకులు అనీష్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా అనీష్ మాట్లాడుతూ.. ఒకేసారి రూ.21 కోట్లు గెలుచుకోవడం ఆనందంగా ఉందని అన్నాడు. ఈ డబ్బుతో తన అప్పులన్నీ తీరిపోతాయని, తన పిల్లల భవిష్యత్తు కోసం కొంత ఖర్చు చేస్తానన్నాడు. ఇప్పటికీ తన ఫ్యామిలీ స్వదేశంలోనే ఉందని, వెంటనే వారిని యూఏఈకి తీసుకొచ్చి హ్యాపీగా ఉంటామని చెప్పాడు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో అలాగే కొనసాగుతానని చెప్పిన అతడు.. ఇంకా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ గురించి ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు.