డోంట్ వర్రీ టెక్కీలు...ఈ కొత్త ఫార్ములా తో నో ఊస్టింగ్స్..! - MicTv.in - Telugu News
mictv telugu

డోంట్ వర్రీ టెక్కీలు…ఈ కొత్త ఫార్ములా తో నో ఊస్టింగ్స్..!

June 1, 2017

సాప్ట్ వేర్ ఇంజనీర్లకు గుడ్ న్యూస్. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందోనన్న టెన్షన్ లో ఉన్న టెక్కీలు ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇన్ఫీ నారాయణ మూర్తి ఫార్ములా ఫాలో అవుతే చాలు…ఎవరి ఉద్యోగాలు పోవు..కాకపోతే సీనియర్లే చిన్న చిన్న మార్పులకు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఈ ఫార్ములాను ఐటీ కంపెనీలు ఇంప్లిమెంట్ చేస్తే… సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు బ్యాడ్ టైమ్ కాదు.. మంచి రోజులే..ఇంతకీ ఆ ఫార్ములాలో ఏముందంటే…

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ తో భారత ఐటీ రంగంలో బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇప్పటికే దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని తీసేశాయి. వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. భవిష్యత్ లో మరింత మందికి ఊస్టింగ్ తప్పదన్న పరిస్థితి..ఈ టైమ్ లో ఇన్ఫీ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌.నారాయణ మూర్తి కొత్త ఫార్ములాను సూచించారు. దీనిని అమలు చేస్తే ఉద్యోగాల కోతకు అడ్డుకట్ట పడుతుందని ఆయన అంటున్నారు. ‘ప్రస్తుత పరిస్థితులను చూసి కంగారుపడాల్సిన పనిలేదు. ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వడం.. సీనియర్ల సాలరీల్లో కోత విధిస్తే ఇది సాధ్యమే. ఉద్యోగుల తొలగింపుపై మానవీయ కోణంలో వ్యవహరించాలి. ఉద్యోగులు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అదే స్థిరమైన కార్పొరేట్‌ సంస్థ. ఐటీ సంస్థల యజమాన్యాలు తమ పెట్టుబడిదారి విధానాల్లో కొంత పట్టువిడుపులు ఉంటే తప్ప ఐకమత్యం రాదు. భారతీయ ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితులు ఎదుర్కోవడం కొత్తేమీ కాదు. సీనియర్లు చిన్న చిన్న మార్పులకు అంగీకరిస్తే యువతకు ఉద్యోగాలు పోవు’నారాయణ మూర్తి చెబుతున్నారు. ఇటువంటి చర్యలనే డాట్‌కామ్‌ సంక్షోభంలో కూడా అనుసరించామన్నారు. మరి
నారాయణమూర్తి చెప్పిన ఈ కొత్త ఫార్ములాను ఐటీ కంపెనీలు పాటిస్తే టెక్కీలకు మంచిరోజులే..లేదంటే బతుకు బస్టాండే..