నయీం ఆస్తుల చిట్టా..వంట మనిషి పేరుతో రూ.100కోట్లు - MicTv.in - Telugu News
mictv telugu

నయీం ఆస్తుల చిట్టా..వంట మనిషి పేరుతో రూ.100కోట్లు

November 28, 2019

గ్యాంగ్‌స్టర్‌ నయీం కేసు విచారణ మరోసారి తెరపైకి వచ్చింది. ఐటీ అధికారులు ఈ కేసుపై వేగం పెంచారు. ఎలాంటి ఆదాయ మార్గం లేకుండానే వందల కోట్లలో డబ్బు, విలువైన భూములను సంపాధించాడు. సెటిల్‌మెంట్లు, ఆయుదాల అక్రమ రవాణా ద్వారానే వీటిని సంపాధించినట్టు గుర్తించారు. ఇలా అతని ఆస్తుల చిట్టా తవ్విన కొద్ది పలు ఆసక్తికర విషయాలు వెల్లడి అవుతున్నాయని చెప్పారు. అతని భార్య హసీనాబేగంను ప్రశ్నించారు. ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు ఎలా వచ్చాయనే కోణంలో విచారణ జరిపారు. 

Nayeem

నయీం సంపాదించిన ఈ ఆస్తులు అతని బినామీల పేర్ల మీద ఉన్నాయని ఐటీ శాఖ గుర్తించింది. అతని భార్య, భావమరిది, వంటమనిషి, సహా పలువురు నమ్మకస్తుల పేరుతో వీటిని రిజిష్టర్ చేయించాడు.వంటమనిషి ఫర్హానా పేరుతో దాదాపు రూ.100 కోట్ల వరకు ఉన్నాయని ఐటీ అధికారులు అంచనా వేశారు. ఫర్హానా పేరుతో హైదరాబాద్‌, సైబరాబాద్‌,రంగారెడ్డి, నల్లగొండలో సుమారు 30 నుంచి 40 ఇంటి స్థలాలు ఉన్నాయి. ఇప్పటి వరకు అతని ఆస్తులు మార్కెట్ రేటు ప్రకారం రూ.1200 కోట్లుగా  ఉంటుందన్నారు. ఏపీ,గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోనూ ఆస్తులు ఉన్నాయి. వీటితో పాటు పెద్ద ఎత్తున బంగారం, విలువైన కార్లు ఇలా చాలా ఆస్తులే ఉన్నాయి.