జపాన్ అంటేనే కొత్త ఆవిష్కరణలకు పుట్టినిల్లు. అలాంటి ఆ దేశం నుంచి మరొక కొత్త ఆవిష్కరణ వచ్చేసింది. అదే.. బీన్ బ్యాగ్ ను కూర్చోవడానికే కాదు.. ధరించి ఎక్కడికంటే అక్కడికి వెళ్లిపోవచ్చు. విశ్రాంతిగా ఉండేందుకు కుర్చీలు, సోఫాలు.. మరీ విశ్రాంతి కావాలంటే బీన్ బ్యాగులను వాడుతుంటాం. అయితే ఈ బ్యాగును ఇంట్లో ఒక పక్కన పెట్టేస్తాం. కానీ దాన్ని ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లాలని ఎప్పుడైనా ఆలోచించారా? జపాన్ వాళ్లు మాత్రం ఆలోచించినట్టున్నారు. అందుకే వేసుకొని వెళ్లే బీన్ బ్యాగులను తయారుచేశారు.
ఎక్కడంటే అక్కడ..
క్లాసికల్ బీన్ బ్యాగ్ ఇప్పటికే సౌకర్యవంతమైన సీటింగ్ ఎంపికను అందిస్తాయి. అయితే అవి సీటింగ్ ఒత్తిడి తగ్గించే సాధనాలుగా పనిచేస్తున్నాయి. అయితే ఇవి కూర్చున్న తర్వాత మీ కదలిక స్వేచ్ఛను పరిమితం చేస్తాయి. అదే వేసుకునే టకికో సూయింగ్ కంపెనీ బీన్ బ్యాగ్ ప్రకారం.. ఎప్పుడైనా, ఎక్కడైనా విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన చేసింది. మీరు దీనిని ధరించినప్పుడు కండరాలు విశ్రాంతి పొందుతాయి. పియర్ ఆకారంలో ఉండే బీన్ బ్యాగ్ త్వరలోనే మరింత కొత్తగా తయారు చేసే పనిలో కంపెనీ ఉంది.
సైజులు.. బరువులు..
ఈ ధరించే బీన్ బ్యాగుకు ప్రేరణ కోవిడ్ -19కాలంలో జరిగిందని టాకికో సీయింగ్ చెప్పింది. ఇంటి నుంచి పని చేసేవారిని దృష్టిలో పెట్టుకొని దీన్ని తయారుచేశారు. ఈ స్టైలిష్ బీన్ బ్యాగు చిన్నవి (ఎస్), మీడియం (ఎమ్), లార్జ్ (ఎల్) సైజుల్లో లభ్యమవుతున్నాయి. అంతేకాదు.. వీటి బరువులు 1.1 కిలోగ్రాములు, 2.2 కిలోగ్రాములు, 5 కిలోగ్రాముల బరువుతో ఉన్నాయని కంపెనీ అంటున్నది. అంతేకాదు వీటి ధర 10,000 లేదా 15,800 జపాన్ యెన్ లుగా నిర్ణయించారు. అంటే మన కరెన్సీలో.. రూ. 16,183 నుంచి సుమారు 25,617 రూపాయల వరకు ధర పలుకొచ్చన్నమాట.