డిగ్గీరాజా విశ్రాంతి తీస్కో.. కేటీఆర్ ! - MicTv.in - Telugu News
mictv telugu

డిగ్గీరాజా విశ్రాంతి తీస్కో.. కేటీఆర్ !

July 20, 2017

 

ట్విట్టర్ ను వేదికగా చేస్కున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఈ మధ్య కాలంల టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. డ్రగ్స్ కేసుల టీఆర్ఎస్ ప్రముఖులకు హస్తం వుందని ఆయన ఆరోపించారు. గతంలో కూడా ఐసిస్ ( ISIS ) కు సంబంధించిన ఫేక్ వెబ్ సైట్లను తెలంగాణ పోలీస్ శాఖ నిర్వహిస్తోందని దానికి కేటీఆర్ మద్దత్తు కూడా వుందని ట్వీట్ చేశారు దిగ్విజయ్ సింగ్. డిగ్గీరాజా కేటీఆర్ ను టార్గెట్ చేయడం మూలంగా వైరల్ అయిపోవచ్చనే ప్లాన్ తోనే ఇదంతా చేస్తున్నారని టీఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి. ఇంత జరుగుతుంటే ఐటి శాఖా మంత్రి కేటిఆర్ దిగ్విజయ్ సింగ్ ను చాలా లైట్ గా తీస్కున్నట్టు కన్పించింది.

దిగ్విజయ్ సింగ్ కు రిటైర్మెంట్ సమయం ఆసన్నమైందని రెస్టు తీస్కోవాలని కేటిఆర్ ట్వీట్ చేసారు. ఇన్ని రోజులకు తెలంగాణ పదాన్ని సరిగ్గా రాసినందుకు దిగ్విజయ్ సింగ్ కు వెటకార పూర్వకంగా కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.