విశాల్ సంస్థపై జీఎస్టీ  దాడులు - MicTv.in - Telugu News
mictv telugu

విశాల్ సంస్థపై జీఎస్టీ  దాడులు

October 23, 2017

కేంద్రంలోని మోదీ సర్కారును దుయ్యబడుతూ ‘మెర్సల్’ తమిళ మూవీలో హీరో విజయ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ సినిమాకు మద్దతు పలికిన మరో కోలీవుడ్ హీరో విశాల్ కు చెందిన సినీనిర్మాణ సంస్థపై జీఎస్టీ(వస్తుసేవల పన్ను) అధికారులు సోమవారం మధ్యాహ్నం దాడులు ప్రారంభించారు. చెన్నై వడపళనిలోని విశాల్ ఫిల్మ్ కంపెనీలో సోదాలు చేస్తున్నారు.

మెర్సల్ పైరసీని చూసిన తమిళనాడు చీఫ్ హెచ్ రాజాను విశాల్ విమర్శించిన నేపథ్యంలో ఈ దాడులు చేపట్టారు. మెర్సల్ కు మద్దతిచ్చినందువల్లే ఈ కక్షపూరిత చర్యలకు దిగారని విశాల్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ కంపెనీ జీఎస్టీని ఎగ్గొట్టిందో లేదో తేల్చుకోవడానికే తనిఖీలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే తాను జీఎస్టీకి సంబంధించిన పత్రాలన్నింటిని ఇదివరకే సమర్పించినట్లు విశాల్ చెబుతున్నాడు.