హీరోయిన్ రష్మికకు ఝలక్..ఐటీ అధికారుల సోదాలు - MicTv.in - Telugu News
mictv telugu

హీరోయిన్ రష్మికకు ఝలక్..ఐటీ అధికారుల సోదాలు

January 16, 2020

Rashmika

సినీ ఇండస్ట్రీ సెలబ్రెటీలపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. గత కొన్నిరోజులుగా పలువురు సెలబ్రెటీల ఇళ్లలో వరుసగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల యాంకర్ అనసూయ, సుమ, హీరోయిన్ లావణ్య త్రిపాఠీతో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖలపై ఐటీశాఖ వరుసగా దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హీరోయిన్ రష్మిక ఇంటిలో సోదాలు చేపట్టారు. గురువారం కర్నాటకలోని ఆమె నివాసంలో తనిఖీలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. 

కొడుగు సమీపంలోని విరాజ్‌పేటలో ఉన్న ఆమె ఇంటితో పాటు, బెంగళూరులోని ఫ్లాట్, కార్యాలయంలో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.గత రెండేళ్లుగా పలు హిట్ చిత్రాల్లో నటించి పెద్ద ఎత్తున ఆఫర్లు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టిన ఐటీ అధికారులు పన్ను చెల్లించనట్టు గుర్తించారు. వెంటనే సోదాలు ప్రారంభించి ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు. సోదాల సమయంలో రష్మిక హైదరాబాద్‌లోనే ఉండటంతో సాయంత్రానికి ఆమె కర్నాటక వెళ్లే అవకాశం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. కాగా ఇటీవల విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె నటించిన సంగతి తెలిసిందే.