డోలో- 650 కంపెనీపై ఐటీ దాడులు.. ఏకంగా 200 మంది - MicTv.in - Telugu News
mictv telugu

డోలో- 650 కంపెనీపై ఐటీ దాడులు.. ఏకంగా 200 మంది

July 6, 2022

కరోనా లాక్‌డౌన్ సమయంలో పాపులర్ అయిన డోలో 650 ట్యాబ్లెట్ తయారీ కంపెనీ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్‌పై బుధవారం ఐటీశాఖ దాడులు నిర్వహించింది. బెంగళూరులోని రేస్ కోర్సు రోడ్డులోని కంపెనీ కార్యాలయంలో 20 మంది అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే సిక్కిం, ఢిల్లీ, తమిళనాడు, పంజాబ్, గోవాలతో పాటు దేశ వ్యాప్తంగా 40 చోట్ల 200 మంది అధికారులు ఈ దాడులలో పాల్గొన్నారు. సంస్థ ఎండీ దిలీప్ సురానా, డైరెక్టర్ ఆనంద్ సురానా నివాసాలపై కూడా దాడులు చేశారు. ఈ క్రమంలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని విశ్వసనీయ సమాచారం. కాగా, కరోనా వచ్చినప్పటి నుంచి ఈ కంపెనీ సుమారు 350 కోట్ల ట్యాబ్లెట్లను విక్రయించి దాదాపు రూ. 400 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది.