అంబానీ కంటే గ్రేట్.. 2 కేసులతో రూ. 217 కోట్ల సంపాదన - MicTv.in - Telugu News
mictv telugu

అంబానీ కంటే గ్రేట్.. 2 కేసులతో రూ. 217 కోట్ల సంపాదన

October 16, 2020

IT Raids on Lawyer Receiving Rs 217

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఐటీ సోదాల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైకోర్టు న్యాయవాదికి చెందిన నివాసాలు, కార్యాలయాలలో తనిఖీలు చేయగా భారీగా నగదు, కీలక పత్రాలు లభ్యం అయ్యాయి. రెండు కేసులలో మధ్యవర్తిత్వం వహించినందుకు గానూ ఏకంగా రూ. 217 కోట్లు తీసుకున్నట్టుగా ఆధారాలు బయటపడ్డాయి. దీంతో లెక్క చూపని నగదుతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

లాయర్‌కు చెందిన 38 ప్రాంతాలలో ఐటీ అధికారులు సోధాలు చేశారు. దీంట్లో  5.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఢిల్లీలోని ఖరీదైన ప్రాంతాల్లో భూములు, నివాస సముదాయాలు, స్కూళ్లు, వాణిజ్య సముదాయాలు, ఇతర ఆస్తులను కొనుగోలు చేసినట్టు గుర్తించారు. వందల కోట్లు సంపాధించి ఆదాయపు పన్ను ఎగవేడయంతో వాటిని సీజ్ చేశారు. అతడి పేరు మాత్రం అధికారులు బయటపెట్టలేదు. ప్రభుత్వ రంగ సంస్ధతో మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఓ ఇంజనీరింగ్ సంస్ధ నుంచి వంద కోట్ల రూపాయలకు పైగా సొమ్మును నగదు రూపంలోనే  స్వీకరించారని వెల్లడైంది. కాగా, ఆ లాయర్  చండీగఢ్‌కు చెందిన వారిగా పేర్కొన్నారు.