IT Raids On Trivikram Friends
mictv telugu

బ్రేకింగ్.. త్రివిక్రమ్‌ సన్నిహితులపై ఐటీ రైడ్స్..!

January 18, 2023

IT Raids On Trivikram Friends

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటే అభిమానులందరికి గుర్తొచ్చే పేరు పవన్ కళ్యాణ్. అయితే పవన్ ప్రాణ స్నేహితుడైన త్రివిక్రమ్ పేరు ఎత్తితే ఇండస్ట్రీ వారికి గుర్తొచ్చే మరో పేరు హారిక & హాసిని క్రియేషన్స్‌. త్రివిక్రమ్ సినిమాలన్నీ ఈ బ్యానర్ పైనే తెరకెక్కుతాయి. అయితే కొద్దిగంటల క్రితం అగ్ర సినీ నిర్మాణ సంస్థ హారిక & హాసిని క్రియేషన్స్‌ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ న్యూస్ టాలీవుడ్ ని షాక్ కి గురిచేస్తుంది. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాలను మాత్రమే నిర్మించే హారిక & హాసిని బ్యానర్ పై మెరుపు దాడి నిర్వహించింది ఐటీ. అయితే అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల కాంబినేషన్ లో వారి సొంత ప్రొడక్షన్ హౌస్ లో సినిమాని ప్రారంభించిన రోజే కావటం గమనార్హం.

అయితే ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి రెండు భారీ బడ్జెట్ చిత్రాలను విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్‌ ని వదిలేసి.. హారిక & హాసిని క్రియేషన్స్ వారి సోదరి సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఆస్తులలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించటంపై ఇండస్ట్రీ సభ్యుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ (చినబాబు)కు చెందిన హారిక & హాసిని క్రియేషన్స్ సంస్థతో పాటు.. ప్రొడ్యూసర్ నాగవంశీ ‘సితార ఎంటర్‌టైన్మెంట్స్’ సంస్థపై బుధవారం ఉదయం ఐటీ అధికారులు దాడిచేశారు. ఈ సెర్చ్ ఆపరేషన్స్‌లో నిర్మాత నాగ వంశీ ‘మై హోమ్ భుజ’ ఫ్లాట్ కూడా ఉంది. ఈ ప్రొడక్షన్ హౌస్‌లోని కుటుంబ సభ్యుల వ్యక్తిగత లాకర్లు కూడా స్కానర్‌లో ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఇంత హఠాత్తుగా ఐటీ దాడులు జరగడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.