it rides on mallareddy,his releatives
mictv telugu

అర్థరాత్రి బ్యాంక్‌కు మల్లారెడ్డి మనవరాలు..

November 24, 2022

తెలంగాణలో ఐటీ రైడ్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. రెండు రోజుల పాటు టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి, ఆయన బంధువుల ఇళ్లల్లో ఐటీ అధికారులు విస్తృత సోదాలు చేశారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని ఐటీ అధికారులతో పాటు ఒడిశా, కర్ణాటక నుంచి వచ్చిన దాదాపు 400 మంది అధికారులు 65 బృందాలుగా విడిపోయి ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఈ తనిఖీల్లో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

దీనిపై సోమవారం విచారణకు రావాల్సిందిగా మంత్రి మల్లారెడ్డికి నోటీసులందించారు. ఐటీ సోదాల్లో భాగంగా మల్లారెడ్డి మనవరాలు శ్రేయ రెడ్డిని ఇంటి నుంచి తీసుకెళ్ళారు. బ్యాంకు లాకర్లు తెరవాలంటూ ఆమెను మహిళా పోలీసులు లేకుండా పురుషులైన ముగ్గురు సీఆర్పీఎఫ్ పోలీసులు తరలించారు. దీనిపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళను రాత్రిపూట లేడి కానిస్టేబుల్స్ లేకుండాలా ఎలా తీసుకెళ్తారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ బెదిరింపుల చర్యల్లో భాగంగానే ఐటీ అధికారులు దాడులు చేశారని..ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి : ఏపీలో కొత్త పార్టీ పెడతాం.. పీఠాధిపతుల వార్నింగ్