రోజువారి కూలీకి ఐటీ నోటీసులు.. అసలేం జరిగిందంటే..! - MicTv.in - Telugu News
mictv telugu

రోజువారి కూలీకి ఐటీ నోటీసులు.. అసలేం జరిగిందంటే..!

February 4, 2020

b.k.kjdvf

పెద్ద నోట్ల రద్దు జరిగిన తర్వాత నుంచి ఐటీ అధికారులు విడ్డూరమైన నోటీసులు జారీ చేయాల్సి వస్తుంది. కనీసం ఇన్‌కమ్ ట్యాక్స్ అంటే ఏంటో కూడా తెలియని వారికి కూడా నోటీసులు ఇస్తున్నారు. పూటగడవని పేదవారికి, దినసరి కూలీలు పన్ను ఎగ్గొట్టారంటూ ఈ మధ్య ఇలాంటివి వచ్చిన సంగతి  తెలిసిందే. తాజాగా అలాంటి ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని నాబారంగ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ కూలీకి తాజాగా నోటీసులు ఇచ్చారు. రూ. 2.59 లక్షల ఐటీ చెల్లించాల్సి ఉందని, వెంటనే చెల్లించాలని పేర్కొన్నారు. ఇది చూసిన ఆ వ్యక్తి ఏం జరిగిందో తెలియక ఆయోమయంలో ఉండిపోయాడు. 

రెక్కడితే కాని డొక్కాడని పరిస్థితిలో ఉన్న తాను రూ. 2.59 లక్షలు తెచ్చి ఎలా కట్టాలని సనధర్‌ గంద్‌ వాపోయాడు. అధికారులను అడిగితే అసలు విషయం తెలిసింది.అతని పేరుమీద బ్యాంకు ఖాతా తీసి 2014 -15 మధ్య కాలంలో రూ. 1.74 కోట్ల లావాదేవీలు జరిగినట్టుగా వెల్లడించారు. అప్పుడు అసలు విషయం తెలిసింది. తాను పప్పు అగర్వాల్ అనే వ్యాపారి ఇంట్లో పని చేస్తున్నానని, ఓసారి అతడు తన భూమి పాస్ పుస్తకాలు, గుర్తింపు కార్డులు తీసుకున్నారని వెల్లడించాడు. దీంతో అతడేే సనధర్ పేరుతో ఖాతా తీసి నగదు లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు. పేదవారి అమాయకత్వాన్ని ఆసరగా చేసుకొని ఎంతో మంది పప్పు అగర్వాల్ లాంటి వ్యక్తులు మోసాలకు పాల్పడ్డారని అధికారులు అంటున్నారు.