ఏషియన్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఏషియన్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు

October 22, 2019

Asian ..

ప్రముఖ ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ, సినీ నిర్మాణ కార్యాలయాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏషియన్ సినిమా అధినేతలు నారాయణదాస్, సునీల్ నారంగ్‌ల ఇళ్లతో పాటు వారి సన్నిహితుల నివాసాలలో ఐటీ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. హైదరాబాద్ నగరంలోని ఎ.ఎమ్.బి మాల్‌ను హీరో మహేష్ బాబుతో కలిసి ఏషియన్ సినిమా సంస్థ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. త్వరలో ఈ సంస్థ మరో అగ్ర హీరో అల్లు అర్జున్‌తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మాణం చేపట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ సంస్థ నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న సినిమాను నిర్మిస్తోంది. నైజాంలో భారీ చిత్రాలను పంపిణీ చేయటంతో పాటు ఏషియన్ సినిమాస్ పేరిట చాలా థియేటర్లు ఈ సంస్థ కలిగి ఉంది.