It was close, says Assam CM Sarma on security breach at Hyderabad event
mictv telugu

మైకు లాగేసుకున్న ఘటనపై స్పందించిన అసోం సీఎం

September 11, 2022

వినాయక నిమజ్జనం సందర్భంగా మొజంజాహీ మార్కెట్ దగ్గర జరిగిన ఘటనపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ స్పందించారు. తనపై పక్కా ప్రణాళికతోనే టీఆర్‌ఎస్ నాయకుడు దాడికి యత్నించాడని బిస్వా శర్మ అన్నారు. వేదికపైకి వచ్చిన టీఆర్‌ఎస్ నాయకుడు.. తనకు చాలా దగ్గరగా వచ్చాడని… తన ప్రసంగాన్ని అడ్డుకోవాలనిచూశాడని.. అయితే, అప్పటికింకా తాను మాట్లాడలేదని అన్నారు. ఆ సమయంలో.. ఏదైనా పదునైన ఆయుధంతో తనపై దాడి చేసే అవకాశం కూడా ఉందని అన్నారు హిమంత. అయితే అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరగడం సాధరణమేనన్నారు. దీనిపై తానేమీ కేంద్రానికి కంప్లైంట్ చేయడం లేదన్నారు.

మరోవైపు.. అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. సీఎం హిమంత బిస్వా శర్మకు భద్రత లోపంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై తెలంగాణ డీజీపీ కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది. అసోం డీజీపీ భాస్కర్ జ్యోతి మహంత.. తెలంగాణ డీజీపీతో ఫోన్‌లో మాట్లాడి, హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం సందర్బంగా సీఎం హిమంతకు జరిగిన ఉదంతంపై వాకబు చేసినట్లు తెలిపింది