తట్టుకోలేక..  పార్లమెంటులోనే ప్రపోజ్ చేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

 తట్టుకోలేక..  పార్లమెంటులోనే ప్రపోజ్ చేశాడు..

November 29, 2019

MP proposes ...

ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరచడానికి రకరకాల దారులు వెతుక్కుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రేమను వ్యక్తపరుస్తుంటారు.  ప్రేయసిని మెస్మరైజ్ చేసి ఆమెను దక్కించుకోవడానికి కొందరు గాల్లో ఎగురుతూ, కొందరు నీళ్లలో ఈదుతూ.. లవ్ ప్రపోజ్ చేస్తున్నారు.. ఓ ఎంపీ మరీ వినూత్నంగా పార్లమెంటులో ప్రియురాలికి ప్రేమ వెల్లడించుకున్నాడు.  పార్లమెంటులో దేశంలోని ప్రజా సమస్యల గురించి మంత్రులు అందరూ చర్చ జరుపుతుంటారు. అలాంటి వాడి వేడి చర్చ మధ్యలో ఎంపీ ప్రపోజ్ చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఆవెంటనే చప్పట్లతో అభినందించారు. 

డై మూరో (ఇటాలియన్‌ ఎంపీ) ఎలీశా అనే అమ్మాయిని గతకొంత కాలంగా ఇష్టపడుతున్నాడు. ఆమెకు ప్రపోజ్ చేయడానికి అతనికి అనువైన సమయం దొరకలేదు. కాలం గడిచిపోతోంది. ఇంతలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. వారం రోజులు సమావేశాల్లోనే ఉండాలి. లవ్ ప్రపోజ్ మరింత ఆలస్యం అవుతుందని  తర్జనభర్జనలు పడ్డాడు. గురువారం పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా డై మూరో ప్రసంగం వినేందుకు ఎలీశా సభకు వచ్చారు. ఇదే మంచి తరుణం అనుకున్నాడు ప్రేమికుడు. సభ ప్రత్యక్ష ప్రసారం మధ్య జరుగుతోంది.. అక్కడ ఇలాంటి పనిచేయడం కరెక్ట్ కాదని అతనికి తెలుసు.. కానీ, అతని మనసు వేరే చెబుతోంది. అంతే.. తన ప్రియురాలిని మెప్పించడానికి తప్పదనుకున్నాడు. 

గ్యాలరీలో అందరూ కూర్చొని ప్రసంగం వింటున్నారు. ఈ సమయంలో మూరో తన ప్రేమను వ్యక్తపరిచాడు. ‘విల్‌ యూ మ్యారీ మీ ఎలీశా’ అంటూ డైమెంట్‌ రింగ్‌ను చూపించాడు. వెంటనే పక్కనున్న సహచర సభ్యులంతా ఆశ్చర్యపోతూనే.. తేరుకుని అతనికి చప్పట్లతో అభినందనలు తెలిపారు. కాసేపటికే ఎలీశా తన ప్రపోజల్‌ను అంగీకరించిందని తోటి సభ్యులు తెలిపారు. అందరూ కలిసి వారిద్దరికి శుభాకాంక్షలు తెలిపారు.