కరోనా సోకిందని నర్సు ఆత్మహత్య..  - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా సోకిందని నర్సు ఆత్మహత్య.. 

March 25, 2020

mnjh

కరోనా వ్యాధి సోకిన ఓ నర్సు తీవ్ర మానసిక వేదనతో ప్రాణం తీసుకుంది. తన ద్వారా మిగతావారికి కూడా సోకి ఉంటుందన్న భయంతో బలవన్మరణానికి పాల్పడింది. చైనా కంటే ఎక్కువ కరోనా మరణాలు చోటుచేసుకుంటున్న ఇటలీలో ఈ విషాదం చోటుచేసుకుంది. 

డేనియెలా త్రెజ్జీ అనే 34 ఏళ్ల నర్సు వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న లంబార్డీలో పనిచేస్తోంది. దీనిపై వైద్య సిబ్బంది తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా రోగులకు సేవ చేసిన డేనియెలా కొన్నాళ్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని నర్సు సంఘం పేర్కొంది. ఇటలీలో నిన్న ఒక్కరోజే 743 కరోనా మరణాలు సంభవించారు. ఆ మహమ్మారి వల్ల ఇప్పటివరకు దేశంలో 6280 మంది కన్నుమూశారు. స్పెయిన్‌లోనూ వైరస్ చెలరేగుతోంది. నిన్న ఒక్కరోజే 750 మంది బలయ్యారు.