రెడ్‌మీకి పోటీగా చవక ధరలో ఐటెల్ ఫోన్.. - MicTv.in - Telugu News
mictv telugu

రెడ్‌మీకి పోటీగా చవక ధరలో ఐటెల్ ఫోన్..

May 17, 2019

అదిరిపోయే ఫీచర్లున్న ఫోన్లను.. అతి తక్కువ ధరకు అందించే కంపెనీ ఐటెల్. తాజాగా ఈ కంపెనీ ఆధునిక ఫీచర్లున్న మరో ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐటెల్ ఏ 46 పేరుతో దీన్ని ఆవిష్కరించింది. ఈ ఫోన్ రెడ్‌మీకి 6ఏ కు పోటీగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు.

Itel A46 Budget Smartphone With Dual Rear Cameras Launched Price, Specifications.

5.45 అంగుళాల డిస్ ప్లే, 1.6 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 1440×720 పిక్సెల్స్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 9పై ఆపరేటింగ్ సిస్టమ్, 2జీబీ ర్యామ్ + 16 జీబీ మెమరీ, 128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం, 8 ఎంపీ+వీజీఏ సెన్సర్ డ్యూయెల్ రియర్ కెమెరా, 2400 ఎంఏహెచ్  బ్యాటరీ ఐటెల్ ఏ46 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు. అలాగే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంది.  ఇన్నీ ఫ్యూచర్ ఉన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.4,999లని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

కస్టమర్లకు ఈ ఫోన్‌‌తో పాటు స్క్రీన్ గార్డ్, బ్యాక్ కేస్‌ ఉచితంగా అందిస్తోంది. 1జీబీర్యామ్‌, 2 జీబీ ర్యామ్‌ రెండు వేరియంట్లలో నాలుగు రంగుల్లో అందుబాటులో ఉంది. అంతేకాదు జియో రూ. 198, 299 (24 నెలలపాటు)   రీచార్జ్‌ ప్యాక్‌లపై రూ.1200 ఇన్‌స్టెంట్‌  క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది.