త్రివిధ దళాల్లో నియామకాల కోసం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీంలో ప్రభుత్వం స్వల్ప మార్పు చేసింది. ఇక నుంచి ఐటీఐ – పాలిటెక్నిక్ పాసైన వారు కూడా అప్లై చేసుకోవచ్చని అర్హతా ప్రమాణాలను సవరించింది. వీరు టెక్నికల్ బ్రాంచులో దరఖాస్తు చేసుకోవచ్చు. దీని వల్ల ప్రి స్కిల్డ్ అభ్యర్ధులకు ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలకు అవకాశం లభించనుంది. ఈ అభ్యర్ధులకు శిక్షణా సమయాన్ని కూడా తగ్గించింది. ఈ మార్పుతో మరింత మంది యువత స్కీంలో చేరి దేశానికి సేవ చేసే అవకాశం కలుగుతుంది. ఇక 20203 -2024 ఏడాదికి గాను ఆర్మీలో అగ్నివీరుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపిక పరీక్ష ఏప్రిల్ 17న నిర్వహిస్తారు. joinindianarmy.nic.in కి వెళ్లి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.